బ్లడ్ ప్రెషర్ ని తెలుగులో రక్తపోటు అంటాము , ప్రపంచం మొత్తం మీద ఈ రక్తపోటు కు సంబందించిన వ్యాధులతో 7.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి ,ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది ..
రక్తపోటు అనేది అధిక రక్తపోటు లేదా అల్ప రక్తపోటు అయిఉంటుంది , ఆరోగ్యంగా ఉన్నవాళ్లలో ఇది సహజమయిన స్థితిలో ఉంటుంది .
ఇప్పుడు రక్తపోటు అంటే ఏమిటో తెలుసుకుందాం ..
గుండె కు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు అధిక ఒత్తిడికి గురిఅవుతూ రక్తాన్ని గుండెకు చేరవేయడాన్ని అధిక రక్తపోటు అంటాము ఈ రక్తనాళాలు రక్తాన్ని తగిన మొత్తం లో గుండెకు చేరవేయడానికి చాల కష్టపడుతూ ఉంటాయి . కొన్ని రకాల కారణాల వల్ల ఇవి కుంచించుకు పోయి గుండెకు చేరాల్సిన రక్తాన్ని అడ్డుకుంటాయి దీని వలన గుండె నొప్పి ఇంకా ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి .
అధిక రక్తపోటు ఈ రోజులలో 25 సం // వయసు వారికీ కూడా వస్తున్నది దీనికి చాల కారణాలు ఉన్నాయి , ఈ అధిక రక్తపోటు వల్ల గుండెపోటు ,గుండెకు సంబందించిన అనారోగ్యాలు , మూత్రపిండాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది .
అధిక రక్తపోటు లక్షణాలు ముందుగా పసిగట్టడం వల్ల చాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు .
అధిక రక్తపోటు లక్షణాలు :
- తలనొప్పి
- అలసట / గాబరా
- కనపడటం లో తేడా / మసకగా కనిపించడం
- ఛాతిలో నొప్పి / ఛాతి లో బరువుగా అనిపించడం
- శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది
- గుండె కొట్టుకునే వేగం లో మార్పు
- మూత్రం లో రక్తం పోవడం
- ముక్కు నుండి రక్తం కారడం
- మైకం
ఇంకా కొన్ని సార్లు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అధిక రక్తపోటు కు గురి అయ్యే అవకాశం ఉంది ,
వైద్యులు రక్తపోటు కొలవడానికి రెండు సంఖ్యల పరిమాణాలు/కొలతలు చూస్తారు
1 --సిస్టోలిక్ పీడనం
2 -- డయాస్టోలిక్ పీడనం
ఈ కొలతలు 120 నుండి 139 mm Hg ( సిస్టోలిక్ పీడనం) / 80 నుండి 89 mm Hg (డయాస్టోలిక్ పీడనం) వరకు ఉంటె అధిక రక్తపోటు కు దగ్గరగా ఉన్నట్టు .
ఈ కొలతలు140 / 90 mm Hg కి సమానంగా లేదా ఎక్కువగా ఉంటె అధిక రక్తపోటు గ వైద్యులు భావిస్తారు ,
ఈ కొలతలు కచ్చితంగా తెలుసుకోవడాని మీ కుటుంబ వైద్యున్ని లేదా కార్డియాలజిస్ట్ ను సంప్రదించండి
అధిక రక్తపోటు ఉంది అని రక్తపోటు ను కొలిచే సాధనంతో కొలుస్తారు , దీంట్లో రీడింగ్
120 / 80 కంటే ఎక్కువగా పలు మార్లు (వివిధ సమయాలలో తరచుగా )వచ్చినప్పుడు అధిక రక్తపోటు గా భావిస్తారు ,
అధిక రక్తపోటు రావడానికి గల కారణాలు :
- జీన్స్
- వారసత్వంగా
- పొగ త్రాగడం
- నిశ్చల జీవనశైలి
- అధిక బరువు
- ఉప్పును అధికంగా తినడం
- ఇతర ఆరోగ్య సమస్యల వల్ల
- శారీరక శ్రమ లేకపోవడం
- ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం
- వయస్సు
- మానసిక ఒత్తిడి
- చెడు క్రొవ్వులు - బ్యాడ్ కొలెస్టరాల్
ఈ పై కారణాల వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది ,
అధిక రక్తపోటు వల్ల కలిగే సమస్యలు :
- గుండె పోటు మరియు గుండె కు సంబందించిన సమస్యలు
- మెదడులో రక్తం గడ్డ కట్టడం
- పక్షవాతం
- మధుమేహం
- మూత్రపిండాల సమస్యలు
అధిక రక్తపోటు ను అదుపులో పెట్టడం ఎలా :
మన యొక్క అలవాట్లను మార్చుకుని దీన్ని అదుపులో పెట్టవచ్చు :
- పొగత్రాగే అలవాటు ఉంటె మొత్తానికే మానెయ్యాలి
- ప్రతి రోజు తగినంత పరిశుభ్రమయిన నీటిని త్రాగాలి
(మన శరీరానికి తగినంత నీటిని త్రాగడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది)
- శరీర బరువు అధికంగా ఉంటె తగ్గించుకోండి
- శారీరిక బరువు ఎక్కువ అవుతే రక్తపోటు ఎక్కువగా అవుతుంది
- మంచి ఆహారాన్ని తినాలి
- ఆకుకూరలు , కాయగూరలు ,క్యారెట్స్ ,బీట్రూట్ , తోటకూర , సొరకాయ , టమాటా ..
అవిసె గింజలు
వీటిలో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి .
విటమిన్ సి , ఐరన్ మరియు మేగ్నెసియం :
ఇవి ఉన్న ఆహారపదార్తాలు తినడం వల్ల కూడా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది ,
ఇవి తృణధాన్యాలలో , ఆకుకూరలలో, సెనగలు , నిమ్మ జాతి పండ్లు ,అరటిపండ్లు మరియు మొలకెత్తిన విత్తనాలు.
ప్రతి రోజు తప్పకుండ 40 నిముషాలు నడవాలి లేదా ఏదయినా శారీరక వ్యాయామం చేయాలి
ప్రతి దినం 15 నిముషాలు అయినా ధ్యానం చేయాలి - శ్వాసకు సంబందించినవి .
ఇలా చేస్తే అధిక రక్తపోటు సమస్యను అధిగమించవచ్చు
అధిక రక్తపోటు ఉంటె మీ వైద్యుని సలహా ప్రకారం మందులు వేసుకోండి , తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి , అధిక రక్తపోటు ను అదుపు చేసే ఆహారాన్నే తినండి .
Add new comment