రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు మరియు రాకుండా ఉండాలంటే ఏంచేయాలి :
మహిళలను పట్టి పీడిస్తున్న వ్యాధులలో రొమ్ము క్యాన్సర్ ఒకటి , భారత దేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒకరు రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు అలాగే ప్రతి 13 ని // మి// ల కు ఒకరు దీనివల్ల మరణిస్తున్నారు ..మరి దీని లక్షణాలు మరియు నివారణ ఎలా అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ..
రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు (breast cancer symptoms in telugu) :
- రొమ్ములలో వాపు ఒకే చోట లేదా మొత్తంగా వ్యాపించి ఉండటం
- రొమ్ము సొట్ట పడినట్టు ఉండటం, రొమ్ము ఆరంజ్ కలర్ లో కనపడటం
- రొమ్ములో లేదా చనుమొనల దగ్గర నొప్పి గా ఉండటం
- చనుమొనలు లోపలికి లాగినట్లు అనిపించడం
- రొమ్ముల చుట్టూ ఉండే చర్మం ఎర్రగా పొడిబారినట్టు ఉండి పొలుసులు లాగ రాలిపోవడం
- చనుమొనల నుండి ద్రవం కారడం ,ఈ ద్రవం ఒకే రొమ్ము నుండి కారుతూ ఆ రొమ్ములో గడ్డ ఉంటె అది రొమ్ము క్యాన్సర్ అయ్యే ప్రమాదం వుంది, చాల సార్లు ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేకున్నా కూడా ఇలా కారే అవకాశం వుంది ..అప్పుడు మీ కుటుంబ వైద్యుని సలహా తీసుకోండి .
- రొమ్ముకు సంబందించిన శోషరస గ్రంధులలో వాపు ( కొన్ని సార్లు ఈ గ్రంధుల వాపు మన క్రింది చేయి మరియు మెడ చుట్టూ వాపు కానీ గడ్డ లాగ ఉండటం )
రొమ్ము క్యాన్సర్ స్థితి (breast cancer stages):
రొమ్ము క్యాన్సర్ 2 స్థితులలో (స్టేజి) ఉంటుంది ,ఒకటి హానికర Invasive మరియు రెండవది హానికరం కానటువంటి Noninvasive
హానికర స్థితి invasive stage : కణజాలం లో , ఇతరభాగాలలో మరియు గ్రంధులలో వ్యాప్తి చెందినటువంటిది
హానికరం కానటువంటి స్థితి noninvasive satge : వాహికల గుండా వ్యాప్తి చెందకుంటే
రొమ్ము క్యాన్సర్ యొక్క దశలు ( 0 నుండి 4 ) :
0 దశ ( 0 stage ) :
వైద్యులు దీన్ని హానికరం కానటువంటిదిగా పరిగణిస్తారు అయినా కూడా చికిత్స అవసరం అవుతుంది .
1 వ దశ ( 1st stage ) :
హానికరంగా భావిస్తారు ఈ దశలో కణతులు 2 సెంటి మీటర్స్ ఇంకా కొన్ని సార్లు దాని కంటే చిన్నగా ఉండే అవకాశం వుంది.
2 వ దశ :
ఈ దశలో కణతులు మొదటి దశ కంటే పెద్దవిగా ఉంటాయి మరియు ఇది కూడా హానికరం ..
ఈ దశలో క్యాన్సర్ శోషరస గ్రంధుల వరకు వ్యాపిస్తుంది .
3 వ దశ :
ఈ దశ కూడా హానికరమే ఈ దశలో క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపించదు.
4 వ దశ :
ఈ దశలో రొమ్ము క్యాన్సర్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంది ,ఎముకలకు , ఊపిరితిత్తులకు ,మెదడుకు , లివర్ కు వ్యాపించే ప్రమాదం వుంది .
ఈ దశలో చికిత్స అనేది క్యాన్సర్ ఇంకా వ్యాపించకుండా చూస్తూ తగ్గే తట్టుగా చేస్తారు .
వ్యక్తిగత కారణాలు :
కొన్ని కారణాలు క్యాన్సర్ పెరగడం మరియు వ్యాప్తిచెందటాన్ని ప్రభావితం చేస్తాయి
- వయస్సు
- హార్మోన్ల యొక్క ప్రభావం , రుతువిరతి ( menopause )
- కుటుంబ లో ఎవరికయినా ఉంటె (కుటుంబ చరిత్ర క్యాన్సర్ కు సంబంధించి)
- కాలుష్యం , ధూమపానం & ఆల్కహాల్
- 35 సంవత్సరాల వయస్సులో మొదటి సంతానం కలగడం వల్ల
- పిల్లలు కలగపోవడం వల్ల
- శరీరం యొక్క ఎత్తు 5.8 '' ఇంకా ఎక్కువ ఉన్న వాళ్లలో
రొమ్ము క్యాన్సర్ నివారణ ఎలా :
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి : అధికబరువు ఎన్నో రకాల క్యాన్సర్ లకు దారి తీస్తుంది ,ముఖ్యంగా రుతువిరతి ( menopause ) తరువాత బరువు పెరగకుండా చూసుకోవాలి .
వ్యాయామం లేదా శారీరికంగా చురుకుగా ఉండటం :
ఎన్నో పరిశోధనల ప్రకారం ఎవరయితే ప్రతి రోజు కనీసం 30 నిముషాలు వ్యాయామం చేస్తారో వారికి క్యాన్సర్ లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
మన పనులు మనం చేసుకోవడం , రోజులో 100000 అడుగులు నడవడం అయినా చేయాలి.
పండ్లు మరియు ఆకుకూరలు / కూరగాయలు :
పోషకాహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది ,
రుతువులలో లభించే అన్ని పండ్లు మరియు ఆకుకూరలు / కూరగాయలు లను తగినంతగా తినాలి
మీ ఆహారంలో విటమిన్ సి , విటమిన్ డి , యాంటీఆక్సిడాంట్స్ , మరియు అన్ని రకాల పోషకపదార్తాలు ఉన్న అహారాన్ని ఎంచుకోవడం వల్ల క్యాన్సర్ ను అరికట్ట వచ్చు .
పొగాకు :
ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది, క్యాన్సర్ రావడానికి పొగాకు అనేది ఒక ముఖ్యమయిన కారణం.
తల్లి పాలు పట్టడం :
తల్లి తన పిల్లకి కనీసం ఓ ఏడాది వరకయినా రొమ్ము పాలు పట్టడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది .తల్లి పాలు తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉండగలుతాడు మరియు వారు రోగ నిరోధకశక్తి ని కలిగి ఉంటారు
సంతాన నిరోధక మాత్రలు :
35 సం.. వయస్సు దాటిన మహిళలు సంతాన నిరోధక మాత్రలను తరచుగా వాడటం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ కు తొందరగా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రొమ్ము క్యాన్సర్ కు సంబందించిన పరీక్షలు :
ఈ క్రింది పరీక్షల వల్ల రొమ్ము క్యాన్సర్ గుర్తించబడుతుంది
- బ్రెస్ట్ ఆల్ట్రాసౌండ్
- ఏం అర్ ఐ ( MRI )
- బయాప్సీ ( జీవధాతు పరీక్ష)
- CT స్కాన్ మరియు పెట్ ( PET ) స్కాన్
ఈ పరీక్షల వల్ల రొమ్ము క్యాన్సర్ ను దాని దశలను మరియు వ్యాప్తి ని గుర్తించవచ్చు .ఇప్పుడు ఉన్న ఆధునిక చికిత్స పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను దాదాపుగా నయం చేయగలుగుతున్నాం ...
చాల మట్టుకు రొమ్ము క్యాన్సర్ కు గురికాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది ..
ఆరోగ్యాన్ని కాపుడుకోండి మీ జీవితాన్ని హాయిగా గడపండి
Note : ఈ ఆర్టికల్ మీద మీ యొక్క అమూల్యమయిన అభిప్రాయాన్ని రాయండి
Add new comment