Image
 
బూడిద గుమ్మడి కాయ  పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఇది చాలా పెద్దది అని అవును ఆకారంలో పెద్దగా ఉండే గుమ్మడికాయ అద్భుతమయిన పోషక విలువలు కలిగి ఉంటుంది  , అందుకే దీన్ని కొన్ని సార్లు ఔషధంగా కూడా వాడతారు. 

బూడిద గుమ్మడి కాయ పుచ్చ జాతికి చెందిన ఒక ప్రత్యేకమైన కాయ ఇందులో నీరు  దాదాపు 96% మిగతావి ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. భారత దేశం లో ఆయుర్వేద ఔషధాలలో దీనిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు.

నీటి పరిమాణం 96 గ్రా, శక్తి 86.2 కిలో కేలరీలు,ప్రోటీన్ 2.0 గ్రా ,కొవ్వు (ఫ్యాట్) 0.0మి గ్రా  కార్బోహైడ్రేట్ 12.05 గ్రా , ఫైబర్ 0.6 గ్రా ,మినరల్స్ , కాల్షియం 5.1mg, ఐరన్ 5.7mg, ఇంకా ఎన్నో విటమిన్లు మరియు సూక్ష్మ ఫోషకాలు ఉన్నాయి 

ఇవి ముఖ్యంగా చలికాలంలో కాపుకు వస్తాయి , తెలుగు వారు , కర్ణాటక  వారు  మరియు మిగతా ప్రాంతాల  వారు  వీటిని వంటకాలలో విరివిగా వాడటం చుస్తూఉంటాం ...

వీటితో తయారయ్యే వడియాలు , గుమ్మడి కాయ హల్వా వంటి సాంప్రదాయ వంటకాలకు భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది ..

గుమ్మడి కాయను మనం వివిధ పేర్లతో పిలుస్తాం తెల్ల గుమ్మడికాయ,శీతాకాలపు గుమ్మడికాయ,మైనపు గుమ్మడికాయ అని వివిధ రకాలపేర్లతో పిలుస్తారు

బూడిద గుమ్మడి యొక్క ఆరోగ్య  ప్రయోజనాలు

1.శరీరం లో చెడు క్రొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది ఆలా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది 
2.గుమ్మడికాయ సహజంగా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఆయుర్వేద గ్రంధాల ప్రకారం బూడిద గుమ్మడికాయ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేధో స్థాయిలు మెరుగు పడతాయి అవి శరీరానికి మరియు మనసుకు ఆందోళన లేకుండా శక్తిని అందిస్తుంది.

3.బూడిద గుమ్మడికాయ రసం మన శరీరానికి అధిక శక్తిని అందిస్తుంది మరియు ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


 క్షయ మరియు రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.

4.ఈ గుమ్మడికాయలు నీటి శాతం ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటంతో  బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.
5. బూడిద గుమ్మడి కాయ  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి మరియు ఆంత్రము, చిన్నప్రేవులు లేక పెద్ద ప్రేవు ల్లో ని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. 
6. బూడిద గుమ్మడికాయ ను సౌందర్య పరంగా కూడా అనేక విధాలుగా ఉపయోగాపడుతుంది . చర్మం నిగారింపు కు జుట్టు కోసం ,వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి మరియు చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది. దీని లో ఉండే పోషకాల వల్ల ఈ ప్రయోజనాలు పొంద గలుగుతున్నాం.


7. గుమ్మడి కాయలలో  పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది

శరీరంలోని విసర్జన వ్యవస్థ ద్వారా సాధారణ శరీర వ్యర్థాల తొలగింపును ప్రేరేపిస్తుంది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది మరియు కంటి చూపు మెరుగవడానికి తోడ్పడుతుంది .

8. గుమ్మడిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది అందుకు తల్లి కావాలనుకునేవారు గుమ్మడిని ఆహారంలో ఉపయోగించుకోవచ్చు వీటి యొక్క గింజలు హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి సహకరిస్తుంది. వీటి గింజల్లో సమృద్ధిగా ఒమేగా త్రీ ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి 
9. బూడిద గుమ్మడికాయ  కాలేయ పనితీరును  మరియు రక్షణ వ్యవస్థలకు ముఖ్యమైన పదార్థం. దీని లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఇంకా విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది 
10. బూడిద గుమ్మడికాయ రసం యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు శీతలీకరణ ప్రభావం కలిగి  ఉండి శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. 

11.శరీరంలో అధిక వేడి ఉన్నవారు రోజూ ఈ జ్యూస్ తాగితే మలబద్ధకం, పైల్స్ మరియు ఇతర  శరీర వేడి వల్ల కలిగే  ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

12.మధుమేహం ఉన్నవాళ్లు బూడిద గుమ్మడిని ఆహారం లో తీసుకుంటే గ్లూకోస్ స్థాయిలు అదుపులో ఉండి మధుమేహం అదుపులో ఉంటుంది ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ : వెంకట స్వామి గారు  అని తెలిపారు  

13.గుమ్మడి కాయని గింజలతో కలిపి తింటేనే ప్రయోజనం అధికంగా ఉటుంది ..ఈ గింజలలో అధిక మొత్తం లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి ..

బూడిద గుమ్మడి యొక్క ఆసక్తి కరమయిన విషయాలు  

1.బూడిద గుమ్మడికాయ ను దిష్టి కోసము ఇళ్ళ ముందు కడతారు 
2.విజయదశమి పండుగరోజు   మరియు గృహప్రవేశం ల లో కూడాదీన్నివాడతారు.

 

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారీ విధానం: చెడు కొలస్ట్రాల్  తగ్గటానికి 

బూడిద గుమ్మడి కాయ పైన ఉన్న చెక్కు మొత్తం తీసివేసి  ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుని రసం లా చేసుకోవాలి (రుచి కోసం కొద్దిగా నిమ్మ రసం మరియు సైన్ధవ లవణం వేసుకోవాలి ) ఈ  జ్యూస్  ను తరచుగా త్రాగడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఇది మెదడు పని తీరును కూడా మెరుగుపరుస్తుంది మరియు చెడు క్రొవ్వును తగ్గిస్తుంది. 

మీ యొక్క ఆరోగ్య సమస్యలకు వైద్యుల సలహాల కోసం వాట్సాప్ చేయండి  9398 601060 
 

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home