ప్రతి దినం ఆనందంగా ఉండటం ఎలా మరియు విజయాన్ని సాధించడం ఎలా :
డబ్బు హోదా అన్ని ఉన్న కూడా ఈ రోజులలో మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం , ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నా ఇంకా ఏదో లేదు అన్న వెలితి, మరి ఈ అసంతృప్తిని ఎలా జయించాలి ఉన్నంతలో ఎలా ఆనందంగా ఉండాలో చూద్దాం (telugu-success-tips-for-life).
క్రమశిక్షణ :
సాధించలేక పోవడానికి మొట్ట మొదటిది జీవితం లో క్రమశిక్షణ లేకపోవడం.
క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది , ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు , మనిషికి తన జీవితం లో క్రమశిక్షణ అవసరం.
క్రమశిక్షణ అనేది మన చేతుల్లోనే ఉంటుంది మన అలవాట్లు , ఆలోచన ,ద్యేయం ప్రతి వాటిలో క్రమశిక్షణ ఉండాలి అంటే అన్నిటిమీద మనకు సరయిన అవగాహన ఉండి దానిని సరిఅయిన పంథాలో సాధించే సామర్థ్యాన్ని పెపొందించుకోవాలి.
మంచి క్రమశిక్షణ వలన తప్పకుండ ఆనందంగా ఉంటారు
లక్ష్యం :
లక్ష్యం ను ఇంగ్లీష్ లో Goal అంటాము , ప్రతి ఒక్కరు తరచుగా వాడే పదం ఇది , పిల్లవాడు IIT లో సీట్ కోసం చేసే ప్రయత్యం లక్ష్యం,
తల్లి తండ్రులు తమ బిడ్డల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడేది కూడా లక్ష్యం ..
ఒక లక్ష్యం అంటూ లేని జీవితం నిస్సారమయినది అని మన గురువులు వేల ఏండ్ల నుండి చెప్తున్నారు ,
ఎవరయితే తన లక్ష్యాన్ని సాధిస్తారో వారు ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఆ లక్ష్యం కోసం వారు పడే శ్రమ అలాంటిది ,
ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నపుడు మనకు దాని గురించి సంపూర్ణమయిన అవగాహన ఉండాలి అంటే ఆ లక్ష్యం మన సామర్థ్యాలకు తగినదయి ఉండాలి అయితేనే మనం ఆ లక్షాన్ని సాధించగలం .
ఆత్మవిశ్వాసం :
ఆత్మవిశ్వాసం మనిషికి చాల అవసరం , ఇది లేకుంటే ఏ చిన్న సులువయిన పనికూడా చేయలేము .
ఆత్మవిశ్వాసం అనేది మన క్రమశిక్షణ వల్ల , మనకు ఉన్న నైపుణ్యాల వల్ల వస్తుంది ,
అందుకే ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఎన్నో సాధిస్తారు వారికి వారు చేసే పని మీద పట్టు ఉంటుంది, ఆలా మనం సంతోషంగా ఉండగలుగుతాం
ఆలోచన
మంచి ఆలోచనలు మనని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుతాయి , మనిషి యొక్క అలవాట్లు ఆలోచన ప్రకారం ఉంటాయి. చెడు ఆలోచనలు బాధలను కలుగ చేస్తాయి
కుటుంబం :
కుటుంబానికి ఎవరయితే విలువ ఇస్తారో వారు నిజమయిన ఆనందం లో ఉంటారు , కుటుంబం అంటే తల్లి తండ్రులు భార్య పిల్లలు , తాత ,అమ్మమ్మలు ఎవరాయన కావొచ్చు, ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి ఎవరయితే తన కుటుంబం తో ఆనందంగా గడుపుతారో వాళ్లకు గుండెకు సంబంధించిన వ్యాధులు , మానసిక రోగాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ,
మంచికుటుంబం వల్ల మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది మరియు మానసికంగా దృడంగా ఉంటారు .
శాస్త్రవేత్తలు కూడా కుటుంబం తో గడపండి మంచి ఆనందకరమయిన జీవితానికి అని చెప్తున్నారు ,
స్నేహితులు :
ఒక మంచి స్నేహితుడు మంచి పుస్తకం జీవితానికి ఎల్లప్పుడూ మేలుచేస్తాయి , చెడు స్నేహాలవల్ల జీవితం నిర్వీర్యం అవుతుంది.
డబ్బు :
డబ్బు ఎక్కువగా సంపాదించాలనే అతి ఆశ మనిషిని రెండు రకాలుగా చెడిపేస్తుంది ఒకటి ఆరోగ్యం పాడవుతుంది మరియు అతి సంపాదన ఎక్కువ నిరాశ కలిగిన జీవితాన్ని ఇస్తుంది,
సంపాదించడం మనిషి యొక్క లక్ష్యం కానీ తనకు అవసరం ఉన్నదానికంటే వందల రెట్లు ఎక్కువగా సంపాదించడం వల్ల జీవితం సరిఅయిన ఆనందాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
ఈ విశ్వం లో ఉన్న ఒకే ఒక్క ప్రాణి తన వచ్చే తరాలకు ఇబ్బడి ముబ్బడిగా సంపాందించిపెడుతుంది భవిష్యత్తు కోసం ఆ ప్రాణి మనిషి , చీమ కూడా దాచుకుంటుంది కానీ అది కూడా వచ్చే ఋతువులో ఆహారం దొరకదు కనుక ఆలా దాచుకుంటుంది .
" ఎవరయితే సంతోషంగా ఉంటారో అతడే నిజమయిన ధనవంతుడు "
ఆరోగ్యం :
మనిషిని ఆనందంగా ఉంచడం లో మొదటి స్థానం లో ఉండేది మంచి ఆరోగ్యం గా ఉండటం ,
ఎవరికయితే మంచి లక్ష్యం ఉంటుందో వారు తప్పకుండ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు లేకుంటే వారు వారి దినసరి పనులను మరియు భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోలేరు కదా !!
అందుకే " ఆనందానికి మొదటి మెట్టు ఆరోగ్యం "
ఏకాగ్రత :
ఏకాగ్రత లేకుంటే ఎన్ని ప్రణాళికలు ఉన్న కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాకూడా పనిని పూర్తి చేయలేకపోతాం.
అందుకే ప్రతి పనిని ఏకాగ్రతతో చేయాలి అపుడే అనుకున్నవి సాధించగలం ..
ఏకాగ్రత రావాలి అంటే ఇవి ఉండాలి :
1 --- చేసే పనిమీద ఇష్టం
2 --- శ్రద్ధ : శ్రద్ధ తో చేసే పని ఎక్కువ విజయం సాధిస్తుంది
3 --- మనసు మీద అదుపు
నిబద్ధత :
నిబద్ధత అంటే చేసే పనికి అంకితమవడం , నిష్ఠతో చేసే పని తొందరగా అవుతుంది దానివల్ల ఎక్కువ తృప్తి కలుగుతుంది, అంకిత భావం లేకపోతే సాధించడం కష్టం .
దైవచింతన :
కుల మతాలకు అతీతంగా ప్రతి వ్యక్తి దైవచింతన కు ప్రాధాన్యమివ్వాలి , దీనివల్ల మనకు ఆత్మ శక్తి లభిస్తుంది.
నిర్ణయం :
సరయిన సమయం లో సరయిన నిర్ణయం తీసుకోవడం ఎంతో ముఖ్యం , మంచి నిర్ణయం వల్ల
సమయం , డబ్బు ఇంకా ఎన్నో వృధాకావు .
మంచి నిర్ణయం తీసుకొవడం ఎలా ?
పరిశోధించాలి
అవగాహన
సమాచారాన్ని సేకరించాలి
సంప్రదించాలి
ధృవీకరించుకోవాలి
నిర్ణాతీసుకునే ముందు చాల సార్లు ఆలోచించాలి
ఆహారం :
మనిషి జీవించి ఉండటానికి ఆహారం అవసరం , ఆహారం తీసుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి , మంచి ఆహారం వల్ల మంచి బుద్ధి వస్తుంది మంచి బుద్ధి వల్ల మంచి పనులు చేస్తాము ఆలా ఆనందంగా ఉండగలుగుతాము,
మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం అవసరం
ఆహారం ఎలా ఉండాలి ?
సాత్విక ఆహారం : మన వేదాలు , మునులు , ఋషులు , సిద్ధులు & ఆయుర్వేదం చెప్పింది కూడా సాత్విక ఆహారం తినమని
సాత్విక ఆహారం అంటే ప్రకృతిలో పండిన శుచి అయిన , మన శరీరానికి సరిపోయే ఆహారం .
పరిశుభ్రమయిన : ఆహారం అత్యంత శుచి కలిగినది అయి ఉండాలి
తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినడం ముఖ్యం
స్వార్థం :
స్వార్థం లేకుంటే ఏ ప్రాణి బ్రతకలేదు కానీ , అతిస్వార్థం అనర్థ దాయకం మనిషికి అతి స్వార్థం ఉంటె అందరు దూరం అవుతారు , ఎవ్వరు నమ్మరు వచ్చి పోయే వారే ఉంటారు కానీ స్థిరంగా ఎవ్వరు ఉండరు , దీనివల్ల ఏ పని కూడా కాదు అయిన అది నిలబడదు.
గౌరవం :
మొదటగా నీ మీద నీ పని మీద గౌరవం ఉండాలి మరియు ఇతరులను హృదయం లో నుండి గౌరవించాలి ...
ఇలా ఉంటె ఎన్నో మంచి పనులు ఆటంకం లేకుండా జరుగుతాయి
గౌరవం పొందటం ఎలా ?
మన మాట తీరు
మన నడవడిక
మనం చేసే పనులు
మనం చేసే సహాయం
కొన్ని సార్లు కొందరు కావాలని గౌరవించరు ...మనసులో నుండి వారిని పక్కన పెట్టండి .
దుస్తులు
మనం వేసుకునే దుస్తులు మన ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి , సందర్భాను సారంగా వేసుకునే దుస్తుల వల్ల మనిషి యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది.
వ్యాయామం
ప్రతీరోజు వ్యాయామం చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు , వ్యాయామం వల్ల సంతోషానికి సంబందించిన హార్మోన్లు ఉత్పత్తి అయి మనం ప్రశాంతంగా ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు.
అభిరుచి
ఏదయినా ఇష్టమయిన పనిని చేయండి , బొమ్మలు గీయడం , ఆటలు ఆడటం ,సంగీతం , తోట పని మరేదయినా కావొచ్చు , ఇలా చేయడం వల్ల మన లోని ఒత్తిడి పోయి ఆనందంగా ఉండగలుగుతాం .
ప్రకృతిని
అపుడపుడు ప్రకృతి ఒడిలో సేదతీరండి , ప్రకృతి మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం , దీనిని సంపూర్ణగా ఆస్వాదించండి.
నైపుణ్యం
నైపుణ్యం లేకుంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్నతంగా బ్రతకడం కష్టం , మంచి నైపుణ్యాలు మనకు మంచి అవకాశాలు కలిగిస్తాయి , అందుకే చేసే పనిలో ఎప్పుడూ నైపుణ్యాలను పెంపొందించుకోండి
ధ్యానం :
ధ్యానం ఒక సహజమయిన ప్రక్రియ , దీన్ని ప్రతిదినం కనీసం 15 నిమి // చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు మరియు ధ్యానం వల్ల మన శరీర ఆరోగ్య వ్యవస్థ బాగవుతుంది ,
ప్రశాంత జీవనం అలవాటుపడుతుంది , నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ప్రతిరోజు ఒక సరయిన సమయం లో ధ్యానం చేయాలి .
దినచర్య :
దినచర్య అనగా మనం ఆ రోజులో చేయాల్సిన పనులు , మనకంటూ ఒక దినచర్య ను తయారు చేసుకుని దానిని ఆచరిస్తే చేసే పనిలో విజయం సాదిస్తాము , అంటే ఆరోజు చేసే పనికి సంబందించిన ఒక పట్టిక , ఏ సమయానికి చేయాలి , ఎలా చేయాలి ,ఎలా చేస్తే పని పూర్తవుతుంది అని ముందుగా మనం రాసిపెట్టుకోవాలి. దీనివల్ల ఒత్తిడి లేకుండా మన పనిని చేసుకోవచ్చు ,
ఆతిథ్యం :
ఇంటిలో బందు మిత్రులకు ఆతిథ్యాన్ని ఇవ్వడం వల్ల చాల ఆనందాన్ని పొందుతాము , మన పనిని పూర్తిగా వదిలేసి ఎల్లప్పుడూ ఇదే పనిలో ఉండాలని కాదు , మన యొక్క భావాలు చెప్పుకునే అవకాశం కలుగుతుంది .
అబద్దం
మనిషి యొక్క విలువ తగ్గిపోవడానికి మొట్ట మొదటి కారణం తరచుగా అబద్దాలు ఆడటం , ఒక్క అబద్దాన్ని కపిపుచ్చడానికి ఇంకా ఇన్నో అనవసరపు అబద్దాలు ఆడాల్సి వస్తుంది ,
ఎదుటివారిని రక్షించడానికి తప్ప అబద్దం ఎప్పటికి ఆడరాదు ,
అబద్దాలు మన గౌరవాన్ని తగ్గిస్తాయి , సంతోషాన్ని హరిస్తాయి , విజయావకాశాలను తగ్గిస్తాయి ,బంధుమిత్రులను దూరం చేస్తాయి .
ఇల్లు
మనిషి ఆనందంగా గడిపే స్థలం ఇల్లు , విజయాలకు పాటుపడే చోటు ఇల్లు అలాంటి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి , ప్రశాంతంగా ఉండాలి.
పైన మనం చర్చిన విషయాలు నిత్యజీవితం లో ఉపయోగపడేవే
ఆనందంగా ఒక లక్ష్యం తో ఉండటం అనేది ఒక్క రోజులో సాధిచించేది కాదు , ఇంకా ఎన్నో విషయాల్లో పరిపూర్ణత సాధిస్తే తప్ప మనిషి ఒక లక్ష్యాన్ని సాధించలేదు... అన్నిటిని సరయిన పద్దతిలో పాటిస్తూ విజయాన్ని సాధిద్దాం ఆనందంగా ఉందాం.
మీ అమూల్యమయిన సలహాలు మరియు సూచనలలను తెలియచేయండి
Add new comment